తెలంగాణ

telangana

ETV Bharat / state

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి: ఎంపీ సోయం బాపూరావు - Soyam Bapurao pays tribute to martyrs at Indraveli Stupa

ఇంద్రవెల్లి స్థూపం వద్ద అమరవీరులకు ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు ఘనంగా నివాళులర్పించారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు కొన్నేళ్ల నుంచి సాగు చేస్తున్న వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Adilabad MP Soyam Bapurao pays tribute to martyrs at Indraveli Stupa
పోడు వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలి

By

Published : Apr 20, 2020, 4:39 PM IST

ఇంద్రవెల్లి ఘటన జరిగి 39ఏళ్లు అయిన సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద గిరిజన సంఘాల నాయకులతో ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా లక్ష మందితో కలిసి అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించాలనుకున్నట్లు పేర్కొన్నారు. కానీ కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా సాధ్యంకాలేదని తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు, తుడుం దెబ్బ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు భాజపా నాయకులు పలువురు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details