తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కట్టడికి ఎంపీ సోయం రూ.60 లక్షల సాయం - కరోనా కట్టడికి రూ.60 లక్షలు ఇచ్చిన ఎంపీ సోయం

కరోనా నివారణకు ఎంపీ లాడ్స్‌ నుంచి రూ.60లక్షలు ఇచ్చారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు. ఆదిలాబాద్‌ రైతుబజార్‌ను సందర్శించిన ఆయన కరోనాపై అవగాహన కల్పించారు. పరిశుభ్రత పాటించాలని సూచించారు.

adilabad mp soyam bapurao
adilabad mp soyam bapurao

By

Published : Mar 28, 2020, 5:36 PM IST

ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానం పరిధిలో కరోనా వ్యాధి కట్టడికి ఎంపీ సోయం బాపురావు తన ఎంపీల్యాడ్స్‌ నుంచి రూ.60 లక్షలు ఇచ్చారు. ఇందులో ఆదిలాబాద్‌ జిల్లాకు రూ.20లక్షలు, నిర్మల్‌ జిల్లాకు రూ.20 లక్షలు, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు రూ.20లక్షలు కేటాయిస్తూ కలెక్టర్లకు లేఖలు రాశారు.

కరోనా కట్టడికి రూ.60 లక్షలు ఇచ్చిన ఎంపీ సోయం

పార్టీ శ్రేణులతో కలిసి ఆదిలాబాద్‌లోని రైతు బజార్‌ను ఎంపీ సోయం సందర్శించారు. ప్రజలకు నిత్యాసవసర సరకులు అందుతున్న తీరు, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని సూచించారు.

ఇదీ చూడండి:ఎలాంటి రెడ్‌ జోన్లు లేవు.. వదంతులు నమ్మొద్దు: ఈటల

ABOUT THE AUTHOR

...view details