తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదివాసీల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే : ఎంపీ సోయం బాపురావు - adilabad mp soyam bapu rao

పోడు భూముల విషయంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు డిసెంబర్ 15లోగా పరిష్కారం కాకపోతే ఆదివాసీల ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు హెచ్చరించారు. ఉట్నూర్​ మండలంలోని మత్తడిగూడా, కొత్తగూడా, దంతనపల్లి, చెరువుగూడా గ్రామాల్లో పర్యటించారు.

adilabad mp soyam bapu rao
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు

By

Published : Oct 17, 2020, 9:42 AM IST

భారీ వర్షాలతో నష్టపోయిన సోయా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ సర్కార్ విఫలమైందన్న బాపురావు.. పోడు భూములకు పట్టాలివ్వాలని కోరారు.

భాజపా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్​తో కలిసి ఉట్నూర్​ మండలంలోని మత్తడిగూడా, కొత్తగూడా, దంతనపల్లి, చెరువుగూడా గ్రామాల్లో సోయం బాపూరావు పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.

కేంద్రం సాయంతో గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మించేలా కృషి చేస్తానని తెలిపారు. పోడు భూముల విషయంలో ఆదివాసీల సమస్యలు డిసెంబర్ 15లోగా పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని బాపూరావు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details