తెలంగాణ

telangana

ETV Bharat / state

తుడుందెబ్బ అణచివేతకు ప్రభుత్వం కుట్ర: ఎంపీ సోయం బాపురావు

ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించేదాకా ఆదివాసీల ఉద్యమాన్ని ఆపబోమని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఈ మేరకు జిల్లాలోని గుడిహత్నూర్​ మండల పరిధిలో ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహాన్ని ఎంపీ ఆవిష్కరించారు.

By

Published : Nov 7, 2020, 6:47 AM IST

adilabad mp bapurav warning to ts govt
తుడుందెబ్బ అణచివేతకు ప్రభుత్వం కుట్ర: ఎంపీ సోయం బాపురావు

ములుగు జిల్లాలో తుడుందెబ్బ నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తూ ఉద్యమ అణచివేతకు కుట్రపన్నుతోందని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం సీతాగొందిలో ఏర్పాటుచేసిన కుమురంభీం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించేదాకా ఆదివాసీల ఉద్యమాన్ని ఆపేది లేదని ఎంపీ స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగానే పొరాటం సాగుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:గ్రేటర్​లో వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్

ABOUT THE AUTHOR

...view details