తెలంగాణ

telangana

ETV Bharat / state

MNREGA Funds Scam in Adilabad : సొమ్ము కూలీలది.. సోకు అధికారులది..!

MNREGA Funds Scam in Adilabad : ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాల్సిన అధికారులే అడ్డదారులు తొక్కి ప్రజల నిధులను నిలువునా దోచేస్తున్నారు. వారు చేసిన కష్టానికి ఇచ్చే వేతనాలను దోచుకుంటున్నారు. ఆదిలాబాద్​లో ఉపాధి హామీ నిధులను అధికారులు నిలువునా కాజేస్తున్నారు. ఇవ్వాల్సిన వేతనాల్ని తగ్గించి మిగతా డబ్బులను సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. పని చేసినా డబ్బులు ఇవ్వడం కూలీలు వాపోతున్నారు.

DRDA
DRDA

By

Published : May 6, 2023, 4:05 PM IST

వేతనాలు చెల్లించకుండ ప్రజల నిధువను దోచేసున్న ప్రభుత్వాధికారులు

MNREGA Funds Scam in Adilabad : ఆదిలాబాద్‌ జిల్లాలో.. జాతీయ ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారు. పనులు చేసిన కూలీలు వేతనాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. కష్టం చేసిన పేదలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోగా.. జిల్లా ఉన్నతాధికారుల సౌకర్యాల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన డీఆర్‌డీఏ వ్యవహారంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం

MNREGA funds scam in Adilabad : ఆదిలాబాద్‌ జిల్లాలో గతేడాది లక్షా 70 వేల మందికి 35 లక్షల పని దినాలు కల్పించాలని యంత్రాంగం భావించింది. ఈ మేరకు ఒక్కొక్కరికి సగటున రోజుకు రూ.256 వేతనం చెల్లించాలని.. ముందుగా నిర్ణయించారు. ఐతే పనులు చేసిన తర్వాత కూలీలకు రోజుకు రూ.189 చొప్పున మాత్రమే వేతనంగా చెల్లించారు. ఆ ఉపాధి హామీ నిధులను ఉన్నతాధికారుల అధికారిక నివాసాలు, కార్యాలయాలు, కొందరు ప్రజాప్రతినిధుల అవసరాల కోసం ఖర్చు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజల సొమ్ము.. ప్రజా ప్రతినిధుల విలాసాలకు..: జిల్లా అదనపు పాలనాధికారి అధికారిక నివాసంలో సోఫాసెట్‌, పరుపుల కొనుగోలు కోసం ఓ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థకు డీఆర్​డీఏ రూ.95 వేలు చెల్లించింది. ఎల్​-కార్నర్‌ బాక్సుల సోఫా కోసం ఇంకోసారి రూ.90 వేల 500 ఖర్చు చేయగా.. కుర్చీలు, బాత్‌రూంలో గీజర్‌ పేరిట డీఆర్‌డీఏ రూ.54 వేల 500 చెల్లించింది. భోథ్‌ నియోజకవర్గంలో ఉన్నతాధికారుల ఆమోదం లేకుండానే కొందరు ప్రజాప్రతినిధుల ఇళ్ల నిర్మాణం కోసం రూ.లక్షలు దారి మళ్లించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పద్దుల కింద మంజూరు చేసే నిధుల వివరాలను ప్రభుత్వ నిర్ధేశిత పద్దుల కింద నమోదు చేయాల్సి ఉంది. కానీ ఆ నిబంధనలను పక్కనపెట్టి, ఇష్టారాజ్యంగా ఉపాధి హామీ నిధులు ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ..

కష్టం మాది.. జల్సాలు వాళ్లవి..ఆదిలాబాద్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో ఉపాధి హామీ పనులు, నిధుల వినియోగం గాడి తప్పిందన్న విమర్శలొస్తున్నాయి. ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు, ఏపీవోల పర్యవేక్షణ అటకెక్కిందన్న ఆరోపలున్నాయి. ఏజెన్సీ మండలాలైన ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, సిరికొండ, బజార్‌హత్నూర్, భోథ్‌, బేల ప్రాంతాల్లో చేసిన పనుల వేతనం కోసం పేదలు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. పని చేసిన కూలీలు వేతనాల కోసం ఎదురుచూస్తుంటే.. అధికారులు విలాసాల కోసం ఉపాధి హామీ నిధులు ఖర్చు చేయటంపై ప్రజలు మండిపడుతున్నారు.

"ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించకుండా అధికారులు ఆ నిధులను దారి మళ్లిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేస్తున్నారు. వేతనాల కోసం కూలీలు ఎదురుచూస్తుంటే.. వాళ్ల కష్టాన్ని పట్టించుకోకుండా అధికారులు విలాసాల కోసం ఆ నిధులు ఉపయోగిస్తున్నారు." - ప్రజాసంఘాల బాధ్యులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details