ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన డిమాండ్ల వినతిపత్రాన్ని పరిష్కారం కోసం తాను హైదరాబాద్‌కు వెళ్లకముందే సీఎంకు, రవాణా శాఖామంత్రి అజయ్‌కుమార్‌కు ఫ్యాక్స్‌లో సమాచారం అందిస్తాననీ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. ఆదిలాబాద్‌లో ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో కార్మికులు ప్రదర్శనగా వచ్చి ఆయనకు వినతిపత్రం సమర్పించారు. కార్మికులంతా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినతిపత్రం స్వీకరించిన ఎమ్మెల్యే జోగు రామన్న... తెలంగాణ రాష్ట్ర సాధనలో...రాజకీయాలకు అతీతంగా అన్ని సంఘాలు సకల జనుల సమ్మెలో పాల్గొన్నాయని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
'ఆర్టీసీ డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తా' - Adilabad MLA Joguramanna latest news
ఆర్టీసీ డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న కార్మికులకు హామీ ఇచ్చారు. సకలజనుల సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులతో అవినాభావసంబంధం ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
'ఆర్టీసీ డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తా'