తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రమే రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వట్లేదు...' - ADILABAD MLA JOGURAMANNA FIRE ON BJP LEADERS

భాజపా ఆదిలాబాద్​ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​పై ఎమ్మెల్యే జోగురామన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జిల్లాలో అభివృద్ధి జరగట్లేదని శంకర్​ చేసిన వ్యాఖ్యలను జోగురామన్న ఖండించారు.

ADILABAD MLA JOGURAMANNA FIRE ON BJP LEADERS
ADILABAD MLA JOGURAMANNA FIRE ON BJP LEADERS

By

Published : Dec 14, 2019, 11:59 PM IST

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఆదిలాబాద్ పర్యటన... భాజపా, తెరాస నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి జోగు రామన్న ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోవడం వల్లే ఆర్మూర్ రైల్వే మార్గం, ఆదిలాబాద్​లో ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణ ఆలస్యమవుతున్నాయని పాయల్​ శంకర్​ ఆరోపించడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులను కేంద్రం ఇవ్వకపోగా తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కేంద్రమే రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వట్లేదు...'

ABOUT THE AUTHOR

...view details