తెలంగాణ

telangana

ETV Bharat / state

మారుమూల పల్లెల్లో ఎమ్మెల్యే పర్యటన - తెలంగాణ వార్తలు

ఆదిలాబాద్‌ జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ ఆరెరాజన్న మృతితో ఖాళీ అయిన స్థానంపై తెరాస ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలో ఆదిలాబాద్‌ గ్రామీణ మండల జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగుతాయన్న ప్రచార నేపథ్యంలో ఎమ్మెల్యే జోగురామన్న ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

మారుమూల పల్లెల్లో ఎమ్మెల్యే పర్యటన
మారుమూల పల్లెల్లో ఎమ్మెల్యే పర్యటన

By

Published : Oct 1, 2020, 6:40 AM IST

ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని మారుమూల పల్లెల్లో ఎమ్మెల్యే జోగురామన్న పర్యటించారు. త్వరలో ఆదిలాబాద్‌ గ్రామీణ మండల జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగుతాయన్న ప్రచార నేపథ్యంలో ఎమ్మెల్యే పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ద్విచక్రవాహనం నడిపి శ్రేణులలో ఉత్సాహం నింపిన ఆయన... వాగుల దాటి ఆదివాసీ పల్లెలకు వెళ్లి వారితో సమావేశమయ్యారు. మండలంలోని సలాయిగూడ, చిలాటిగూడ, ఎస్సీగూడ, లోహర, ఖండాల, మొలలగుట్ట, అర్లికోరి గ్రామాల్లో పర్యటించారు. రహదారులతో పాటు వంతెనలు నిర్మిస్తామని హామీలిచ్చారు. జడ్పీటీసీతో పాటు జడ్పీ వైస్‌ఛైర్మన్‌ పదవి దక్కించుకునేందుకు భాజపా, కాంగ్రెస్‌లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయన్న ఊహగానాలతో తెరాస తన పట్టు నిలుపుకొనేందుకు ముందస్తు ప్రచారానికి దిగడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

ఇదీ చూడండి:అయ్యో పాపం.. ఎవరో పాపను వదిలేశారు..

ABOUT THE AUTHOR

...view details