బాలల చలనచిత్ర వేడుకలను ఇకుముందు నిరాటంకంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని ఆదిలాబాద్ శాసనసభ్యుడు జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లో తెలంగాణ కళావేదిక-రెయిన్‌స్టార్ డ్యాన్స్ అకాడమీ సంయుక్తంగా రాష్ట్రస్థాయి జానపద నృత్యోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల ముగింపు సభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జానపద కళలు, సాహిత్యం మనిషిని ఎన్నో రుగ్మతల నుంచి కాపాడుతాయని జోగు రామన్న వ్యాఖ్యానించారు. నృత్యోత్సవాల్లో ప్రతిభ చూపించిన వివిధ జిల్లాలకు చెందిన కళాకారులకు బహుమతులను ప్రదానం చేశారు.
'బాలల చలన చిత్రోత్సవ వేడుకలను నిర్వహించేలా చూస్తా' - jogu ramanna
ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జానపద నృత్యోత్సవాలకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాలల చలన చిత్ర వేడుకల నిర్వహణ గురించి ముఖ్యమంత్రితో మాట్లాడుతామని హామీ ఇచ్చారు.
సీఎం దృష్టికి బాలల చలన చిత్రోత్సవ వేడుకలు