తెలంగాణ

telangana

ETV Bharat / state

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆదిలాబాద్​ జేసీ.. - Adilabad JC Sandhyarani Latest News

ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ మండలం బీర్​సాయి పేటలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆదిలాబాద్ జేసీ సంధ్యారాణి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి సమస్యలు కలగకుండా చూడాలని ఆమె ఆధికారులను ఆదేశించారు.

adilabad-jc-sandhyarani-has-inaugurated-a-rice-purchasing-center-at-beersai-peta-utnoor-zone-adilabad-district
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆదిలాబాద్​ జేసి..

By

Published : Nov 19, 2020, 10:57 PM IST

రైతులు పండించిన వరి పంటను కొనుగోలు చేసేందుకు వచ్చిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదిలాబాద్​ జిల్లా జేసీ సంధ్యారాణి పేర్కొన్నారు.

గురువారం ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ మండలం బీర్​సాయి పేటలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరికొనుగోలు కేంద్రాన్ని జేసీ సంధ్యారాణి, ఉట్నూర్​ ఎంపీపీ జయవంత్​రావు ప్రారంభించారు.

ముందుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు వరికోత కోసేందుకు యంత్రాలను పంపిణీ చేయాలని కోరారు. రైతులు పండించిన పంటను ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు జరపాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details