ఆదిలాబాద్ పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలను కో-ఎడ్యుకేషన్ కళాశాలగా మారుస్తూ... ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి ప్రజావాణి విభాగం ముందు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలిని నినాదాలు చేశారు. జిల్లా సంయుక్త పాలనాధికారి సంధ్యారాణి విద్యార్థినుల వద్దకు వచ్చి వినతి పత్రాన్ని స్వీకరించారు. విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్‌తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.
'కో-ఎడ్యుకేషన్ కళాశాలగా మార్చొద్దు' - కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు
మహిళా డిగ్రీ కళాశాలను కో-ఎడ్యుకేషన్ కళాశాలగా మార్చొద్దని కోరుతూ... ఆదిలాబాద్‌లోని మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆందోళన చేశారు.
!['కో-ఎడ్యుకేషన్ కళాశాలగా మార్చొద్దు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4830262-619-4830262-1571721389206.jpg)
'కో-ఎడ్యుకేషన్ కళాశాలగా మార్చొద్దు'
'కో-ఎడ్యుకేషన్ కళాశాలగా మార్చొద్దు'