ఆదిలాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,100గా పలికింది. జిల్లా చరిత్రలో ఇదే అత్యంత గరిష్ట ధరగా నమోదైంది. మార్చి మాసంలో లాక్‌డౌన్ కంటే ముందు పది గ్రాముల పసిడి ధర రూ. 44,300 ఉండగా.. క్రమంగా అది రూ. 43వేల వరకు తగ్గుతూ వచ్చింది.
పసిడి ధర రూ. 50,100..ఆదిలాబాద్ చరిత్రలో అత్యధికం..! - Adilabad Bullion Market Latest News
పసిడి ధర పైపైకి ఎగబాకుతోంది. ఆదిలాబాద్‌లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,100 పలికింది. ఈనెల 16న ధర రూ. 49,500 వరకు చేరింది. తాజాగా రూ.50,100కి గరిష్ట ధర నమోదైంది.హైదరాబాద్ బులియన్ మార్కెట్‌కు అనుగుణంగా జిల్లా పసిడి వర్తక వ్యాపారం సాగుతుంది.
ఆదిలాబాద్ లో పసిడి ధర రూ. 50,100.. చరిత్రలో అత్యధికం..
లాక్‌డౌన్ ఆంక్షలు తొలగటం.., ఇప్పుడు పెళ్లిల్లకు ముహుర్తం ఖరారు కావడం వల్ల మళ్లీ బంగారానికి రెక్కలు వచ్చాయి. పైగా అంతర్జాతీయ మార్కెట్ లో దిగుబడి లేకపోవడం వ్యాపారస్తులకు కలిసి వచ్చింది. శనివారం రూ. 49,500లు ఉన్న పసిడి ధర.. సోమవారం నాటికి రూ. 50,100 చేరుకొని సామాన్యుడు కొనుగోలు చేయలేనంత స్థాయికి ఎగబాకింది.
ఇదీ చూడండి:దేవాదులలో సాగునీటిని విడుదల చేసిన మంత్రి ఎర్రబెల్లి