అతనో సాధారణ రైతు. కరోనా చేస్తున్న విజృంభణ గురించి తెలుసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. బాధితులకు ఏ రకంగానైనా సాయం చేయాలని తలచాడు. చేయాలన్న తపన.. చేసేందుకు డబ్బులున్నా.. ఎలా చేయాలో తోచలేదు. ఈటీవీ- ఈటీవీ భారత్ ద్వారా పాలనాధికారి శ్రీదేవసేనకు రూ. 50వేల చెక్కును అందించాడు. అతనే ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వికి చెందిన మోర హన్మాండ్లు.
కరోనాపై పోరుకు రైతన్న చేయూత.. కలెక్టర్కు చెక్కు - corona effect in adilabad
కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి సామాన్య రైతు చేయూతనందించాడు. రూ.50 చెక్కును పాలనాధికారి శ్రీదేవసేనకు అందించాడు ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వికి చెందిన అన్నదాత మోర హన్మాండ్లు.
కరోనాపై పోరాటం: 50 వేల విరాళం ఇచ్చిన సన్నకారు రైతు
చిన్న సన్నకారు రైతుకు కరోనాపై పోరుకు సాయం చేయాలని ఎందుకు అనిపించింది.. అతనిలో ఆ స్ఫూర్తి నింపిందెవరు వంటి వివరాలు ఆ రైతన్న మాట్లల్లోనే..