కన్నకొడుకే కాడెద్దులా మారి పొలం చదను చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గావ్‌కు చెందిన ఆదివాసీ రైతు అభిమాన్‌కు ఆరెకరాల పొలం ఉంది. ఖరీఫ్ పనులు వేగం కావడం వల్ల తనకున్న ఎద్దులతో పొలాన్ని చదను చేసే క్రమంలో.. అనారోగ్యంతో ఆదివారం రోజున ఓ ఎద్దు చనిపోయింది.
కన్న కొడుకే కాడెద్దయ్యాడు.. తండ్రి కష్టాన్ని ఒడ్డు దాటించాడు..! - కన్న కొడుకే కాడెద్దయ్యాడు.. తండ్రి కష్టాన్ని ఒడ్డు దాటించాడు..!
వ్యవసాయమే అతనికి ఆధారం. యంత్రాలతో సాగు చేసేంత పెట్టుబడి లేదు. ఖరీఫ్ రానే వచ్చింది. ఉన్న ఎద్దులతోనే పొలాన్ని సిద్ధం చేసేందుకు పూనుకున్నాడు. ఇంతలోనే ఓ ఎద్దు కాలం చేయటం.. ఓ వైపు వరుణుని రాక.. చేతిలో డబ్బులు లేకపోవటం.. ఈ ఒడుదొడుకులన్నింటినీ దాటేందుకు.. తన కొడుకునే కాడెద్దును చేశాడు ఆ రైతు..!
Adilabad farmer doing farming works with his son replacing ox
పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితిలో ఉన్న అభిమాన్... మరో ఎద్దును కొనాలంటే కనీసం రూ. 40వేలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. పైగా సొమవారం వరుణుడు పలకరించడం వల్ల సమయం దాటిపోకుండా ఉండాలంటే పొలాన్ని చదును చేయకతప్పని పరిస్థితి. ఉన్న ఒక్క ఎద్దుతోపాటు మరోవైపు తన కన్నకొడుకు సాయినాథ్‌నే కాడెద్దుగా మార్చి పొలం చదనుచేశాడు. చేతిలో డబ్బులేనిది ఏంచేస్తాం..? ఏదో ఒకరకంగా బతకాలి కదా..! అనే తన మాటలు మనసును కదిలిస్తున్నాయి.
ఇదీ చూడండి: Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..!
Last Updated : Jun 15, 2021, 6:39 AM IST