ద్విచక్ర వాహనదారుల క్షేమమే లక్ష్యంగా.. ఆదిలాబాద్ జిల్లా రవాణాశాఖ అధికారులు హెల్మెట్ ధారణపై విస్త్రృతప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేస్తూ ఇదివరకే ప్రచారం చేశారు.
హెల్మెట్ లేదా.. అయితే పెట్రోల్ కూడా లేదు..! - హెల్మెట్ ధారణపై విస్త్రృతప్రచారం
హెల్మెట్ ధరిస్తేనే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. హెల్మెట్లు కచ్చితంగా ధరించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.
హెల్మెట్ లేదా.. అయితే పెట్రోల్ కూడా లేదు!
ముఖ్య కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తూ వాహన పత్రాలు లేని వారితో పాటు హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు వేస్తున్నారు. బంకుల్లో సైతం హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలనే నిబంధనను కఠినంగా అమలు పరుస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న ఏ ఒక్కరిని వదిలేది లేదని వారు తేల్చి చెబుతున్నారు.
ఇదీ చదవండి:హైదరాబాదీ కుర్రాడు... స్మార్ట్ హెల్మెట్ రూపొందించాడు