తెలంగాణ

telangana

ETV Bharat / state

'అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్' - ఆదిలాబాద్ జిల్లాలో లాక్​​డౌన్​

లాక్​డౌన్​ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ రాజేశ్​ చంద్ర ఆదేశించారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు అదనపు పాలనాధికారి నటరాజ్​ విజ్ఞప్తి చేశారు.

adilabad district sp, additional collector inspected lockdown execution in city
'అనవసరంగా బయటకు వస్తే వాహనాలు సీజ్'

By

Published : May 18, 2021, 4:53 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ అమలను జిల్లా ఎస్పీ రాజేశ్‌ చంద్ర, అదనపు పాలనాధికారి నటరాజ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదిలాబాద్‌ పురపాలక సంఘం పరిధిలో జనసంచారం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. అనవసరంగా బయటకు వచ్చే వాహనాలను సీజ్​ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

ఒకవేళ అత్యవసరమైతే తెలంగాణ పోలీసు లాగిన్‌లో పేరు నమోదు చేసుకొని అనుమతి తీసుకోవాలని ఎస్పీ సూచించారు. మాస్కు లేకుండా బయటకు రావొద్దని అదనపు పాలనాధికారి ప్రజలను కోరారు.

ఇదీ చదవండి:కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో

ABOUT THE AUTHOR

...view details