తెలంగాణ

telangana

ETV Bharat / state

కేస్లాపూర్‌లో నాగోబా జాతర వేడుకలకు రంగం సిద్ధం - తెలంగాణ వార్తలు

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా జాతర వేడుకలకు సిద్ధమైంది. గంగాజలం కోసం కలమడుగు రేవు హస్తిన మడుగుకు మెస్రం వంశీయులు పాదయాత్రగా బయల్దేరారు. ఫిబ్రవరి 11న సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి నాగోబా జాతరను ప్రారంభిస్తారు.

Nagoba Jatara Celebrations
నాగోబా జాతరకు సిద్ధమౌతున్న కేస్లాపూర్‌

By

Published : Jan 22, 2021, 5:33 AM IST

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా జాతర వేడుకలకు రంగం సిద్ధమైంది. గంగాజలం కోసం కలమడుగు రేవు హస్తిన మడుగుకు మెస్రం వంశీయులు పాదయాత్రగా బయల్దేరారు. ఆదివాసుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ జాతరను... ఏటా పుష్యమాసంలో నిర్వహిస్తారు.

మాసం ప్రారంభమైన నెల రోజుల ముందు నుంచే నాగోబా ఆలయంలో నిర్వహించే పూజలు, జాతర గురించి ప్రచారం చేస్తారు. పూజల కోసం నాగోబా ఆలయాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేసే ఆనవాయితీ కొనసాగుతోంది. అందులో భాగంగానే గంగా జలం కోసం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గోదావరి వరకు... మెస్రం వంశస్థులు కాలినడకన బయల్దేరారు. ఫిబ్రవరి 11న సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి నాగోబా జాతరను ప్రారంభిస్తారు.

ఇదీ చదవండి:అభ్యర్థి ఎవరైనా సహకరించండి... ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ గురి

ABOUT THE AUTHOR

...view details