తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం ఇవ్వడం లేదని.. పార్టీ కార్యాలయం కోసం టెండరు.!

ఆదిలాబాద్‌ జడ్పీ కార్యాలయం ఆధ్వర్యంలో 15 దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు టెండరు వేశాడు ఓ నాయకుడు. ప్రభుత్వం తమ పార్టీ విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్లే వేలంలో పాల్గొన్నట్లు వెల్లడించారు.

congress in tendor
ఆదిలాబాద్‌

By

Published : Mar 17, 2021, 4:25 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి, అధ్యక్షుడు సాజిద్‌ఖాన్.. పార్టీ‌ కార్యాలయం కోసం టెండరులో పాల్గొని ఓ గదిని దక్కించుకోవడం చర్చనీయాంశమైంది.‌ జడ్పీ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్మించిన 15 దుకాణాలకు బుధవారం.. బహిరంగ వేలం నిర్వహించారు. సాజిద్‌ఖాన్‌ రెండో నంబరు దుకాణానికి డిపాజిట్‌ కింద రూ. 40వేలు చెల్లించి.. నెలకు రూ.16వేల అద్దెతో ఆ దుకాణాన్ని దక్కించుకున్నారు.

ఇతర పార్టీలకు స్థలాలు కేటాయించిన ప్రభుత్వం.. తమ పార్టీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని సాజిద్‌ ఖాన్‌ ఆరోపించారు. అందుకే విసిగిపోయి టెండరులో పాల్గొన్నట్లు వివరించారు. ఇప్పటికైనా అధికారులు పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:న్యాయవాద దంపతుల హత్యతో తెరాసకు సంబంధం లేదు: సీఎం

ABOUT THE AUTHOR

...view details