తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి' - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్తలు

గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదిలాబాద్‌ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ అన్నారు. రైతులతో కలిసి కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు.

Adilabad district BJP president Payal Shankar protest at collectorate
గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

By

Published : Jan 11, 2021, 5:41 PM IST

గిరిజనులు సాగు చేస్తున్న పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని ఆదిలాబాద్‌ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ అన్నారు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం రామాయి గ్రామస్థులతో కలసి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.

అనంతరం జిల్లా అదనపు కలెక్టర్​ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. సంబంధిత భూములను సర్వే చేసేందుకు త్వరలోనే అధికారులను పంపిస్తామని.. సాగు చేస్తున్న రైతులకు పట్టాలు వచ్చేలా చూస్తామని ఆమె హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు.

ఇదీ చదవండి: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ముగ్గురు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details