మిడతల దండు నుంచి మండలానికి ప్రమాదం పొంచి ఉందని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల వ్యవసాయ అధికారి రవీందర్ అన్నారు. మండల సర్వసభ్య సమావేశంలోమిడతల దండు గురించి చర్చించారు. మహారాష్ట్ర నుంచి మిడతల దండు వస్తే.. తొలుత జిల్లాలోని భీంపూర్ మండల సరిహద్దులోని గ్రామాలకే వస్తాయని వ్యవసాయ అధికారి అన్నారు.
మిడతల దండు వస్తోంది.. రైతన్నలు జాగ్రత్త..! - ఆదిలాబాద్ జిల్లా వార్తలు
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలానికి మిడతల దండు పొంచి ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండల సర్వసభ్య సమావేశంలో మండల వ్యవసాయ అధికారి రవీందర్ అన్నారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
మిడతల దండు వల్ల నష్టం వాటిల్లకుండా నివారణ చర్యలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. మండల పరిధిలోని అన్నీ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. మండల అధ్యక్షురాలు రత్నప్రభ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పీటీసీ సుధాకర్, ఉపాధ్యక్షులు లస్మన్న, ఎంపీడీవో శ్రీనివాస్, తహశీల్దార్ స్వాతి, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!