ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోకు మేడారం జాతర కలిసొచ్చింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులను చేరవేర్చేందుకు ఆదిలాబాద్ డిపో పరిధిలోని చెన్నూరు నుంచి మేడారానికి 55 బస్సులు వేశారు. దీనిద్వారా డిపోకు దాదాపు 20 రోజుల్లో ఏకంగా రూ.54 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది.
ఆదిలాబాద్ డిపోకు మేడారం జాతర కానుక - medaram jatara in mulugu district
తెలంగాణ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆర్టీసీకి కనక వర్షం కురిపించింది. ఈ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడం వల్ల ఆదిలాబాద్ డిపోకు పెద్దఎత్తున ఆదాయం వచ్చింది.
ఆదిలాబాద్ డిపోకు మేడారం జాతర కానుక
ఇందుకు కృషి చేసిన కారణమైన డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ యాజమాన్యం ఈరోజు సత్కరించింది. క్రితంసారి కంటే అదనపు ఆదాయం వచ్చిందని డిపో మేనేజర్ శంకర్రావు హర్షం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి :తుపాకులు పట్టిన జవానుల చేతుల్లో చీపుర్లు