ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలను బోథ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. బి. కిరణ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. కళాశాల పని తీరు, వసతుల కల్పన, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ శ్రీమతితో కళాశాల నిర్వహణపై ఆరా తీసి ఆమెకు తగు సూచనలు చేశారు. వర్షపు నీరు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కళాశాలలో బాలికల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని న్యాయమూర్తి హామీ ఇచ్చారు.
బోథ్ కోర్టు న్యాయమూర్తి ఆకస్మిక తనిఖీ - ఆకస్మిక తనిఖీ
ఆదిలాబాద్ జిల్లాలోని బాలికల సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా బోథ్ న్యాయమూర్తి తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను తీర్చేందుకు తనవంతు సాయం అందిస్తానని తెలిపారు.

బోథ్ కోర్టు న్యాయమూర్తి ఆకస్మిక తనిఖీ