ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. కొవిడ్ 19 కంట్రోల్ రూమ్‌ను జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ప్రారంభించారు. కొవిడ్ అత్యవసర పరిస్థితుల్లో ప్లాస్మా, ఆక్సిజన్, ఆసుపత్రి బెడ్స్, వెంటిలేటర్, మెడిసన్ వీటిలో ఏ అవసరం ఉన్నా... సంప్రదించాలని కోరారు. పది మందితో కూడిన ఒక టీమ్ తయారుగా ఉంటుందని పేర్కొన్నారు. ఆసుపత్రి బెడ్లు, చికిత్స పొందుతున్న వారి వివరాలను అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అవసరమున్న వారికి ఆక్సిజన్ సిలిండర్ పంపిణీ చేశారు.
ఆదిలాబాద్‌లో కొవిడ్ 19 కంట్రోల్ రూమ్ ప్రారంభం - Adilabad covid 19 Control Room opens in Adilabad district
ఆదిలాబాద్‌లో కొవిడ్ 19 కంట్రోల్ రూమ్ ప్రారంభమైంది. దీనిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ప్రారంభించారు. ఏ అవసరం ఉన్నా... సంప్రదించాలని కోరారు.
![ఆదిలాబాద్‌లో కొవిడ్ 19 కంట్రోల్ రూమ్ ప్రారంభం Adilabad covid 19 Control Room opens](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:30:03:1619604003-tg-adb-03-28-cong-pro-ts10029-28042021152340-2804f-1619603620-1105.jpg)
Adilabad covid 19 Control Room opens