తెలంగాణ

telangana

By

Published : Jun 5, 2020, 1:53 PM IST

ETV Bharat / state

మొక్కలు నాటిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

ఆదిలాబాద్​ జిల్లా కోర్టు ప్రాంగణంలో పర్యావరణ దినోత్సవ వేడుకలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటి.. పక్షుల కోసం గూళ్లు ఏర్పాటు చేశారు. విత్తనాలు చల్లి.. పక్షుల కోసం నీళ్లు ఏర్పాటు చేశారు.

Adilabad Court Chief Judge Participated In Environment Day
మొక్కలు నాటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి

ఆదిలాబాద్​ జిల్లా కోర్టు ప్రాంగణంలో పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కోర్టు ప్రాంగణంలో సిబ్బందితో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొక్కలు నాటి.. పక్షుల కోసం గూళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది అన్నారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని. మొక్కలు నాటి, పక్షుల కోసం ఏర్పాటు చేసిన గూళ్ల దగ్గర నీరు, విత్తనాలు పెట్టారు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని ఆమె అన్నారు. పర్యావరణం బాగుంటే.. మనుషులు, జీవులు అన్నీ బాగుంటాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details