Adilabad Congress Leaders Class War : ఆదిలాబాద్ పట్టణంలోని విద్యుత్తు తరంగణిలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ (Congress) కమిటీ బీసీ ఐక్యవేదిక సభ రసాబాసగా మారింది. ఈ సభకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీఎంపీ వి.హనుమంతరావు హాజరుకాగా.. ఆయన సమక్షంలోనే ఇరువర్గాలు తోపులాటకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల పార్టీలో చేరిన ఎన్‌ఆర్‌ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి సభకు రావడం వివాదానికి తెరలేపింది. ఆయన చేరికను తొలి నుంచి జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, పీసీసీ నేత గండ్రత్ సుజాత వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు.
Revanthreddy on Assembly Seats : 'రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యతను నేను తీసుకుంటా'
ఇవాళ జరిగిన సభకు హఠాత్తుగా కంది శ్రీనివాస్‌రెడ్డి తన కాన్వాయ్‌తో సభకు రావడంతో సాజిద్‌ఖాన్, సుజాత వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో కంది వర్గీయులు ఏకంగా మూసి ఉన్న గేట్లను తోసుకుంటూ సభ ప్రాంగణంలోకి దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్తతను రేకెత్తించింది. ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వేదికపై తమ నేతను పిలవాలని కంది వర్గీయులు పట్టుబట్టారు. చివరకు వీహెచ్ జోక్యం చేసుకుని ఆయన్ను వేదికపైకి పిలిచినా ఇరువర్గాలు మరింత రెచ్చిపోయి నినాదాలు చేశారు.
"కాంగ్రెస్‌లో ఇలాంటి ఆచారం లేదు. కొత్తగా పార్టీలోకి వచ్చిన కంది శ్రనివాస్కు ఇది తగదు. పార్టీ పెద్దలను గౌరవించాలి. పార్టీ విధివిధానాలను పాటించాలి. ఆయనకు కొంత సమయం ఇచ్చాను. అయినప్పటికి గొడవ ఆగలేదు". - వి. హనుమంతరావు, మాజీ ఎంపీ
MP Komatireddy latest Comments : '2023 ఎన్నికల్లో.. ఉమ్మడి నల్గొండలో 12 స్థానాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్'
Adilabad BC Congress Clash War : తొలుత అందరిని సముదాయించే యత్నం చేసిన వీహెచ్.. ఎవరు వినిపించుకోకపోవడంతో తానే బయటకు వెళ్లిపోయారు. చివరకు కంది శ్రీనివాస్ రెడ్డి సభ స్థలం నుంచి వెళ్లిపోవడంతో కార్యక్రమం కొనసాగింది. ఇదే సందర్భంలో కంది శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో మాట్లాడిన గండ్రత్ సుజాత బీసీల ఐక్యతను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని.. సభకు రాకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని ఎన్‌ఆర్‌ఐ (NRI) కంది శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
"ఈ వేదిక పెద్దగా మాజీ ఎంపీ వి. హనుమంతరావును ఆహ్వానించాం. ఆయన ఎదుటే కంది వర్గీయులు నిరసనలకు దిగారు. గొడవ వద్దు. నిరసనలు వద్దు అని చెప్పిన ఆయన వినలేదు. అది దృష్టిలో పెట్టుకొని కంది శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ సభలకు, సమావేశాలకు కంది శ్రీనివాస్‌ను బహిష్కరిస్తున్నాం."- సాజిద్‌ఖాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
Adilabad Congress Leaders Class War ఆదిలాబాద్‌లో బహిర్గతమైన కాంగ్రెస్ వర్గపోరు.. వీహెచ్ ఎదుటే దాడి Revanth Reddy Fires on CM KCR : 'నన్ను తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నం.. బీఆర్ఎస్కు ఈసారి 25 సీట్లే'
Congress Latest News : కారు స్పీడ్‌కు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు
Jogu Ramanna Challenges Revanth Reddy : 'కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నేను ఉరేసుకుంటా'