ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే నలుగురు సిబ్బందికి కరోనా నిర్ధరణ అవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్ ఏవో సైతం కరోనా పాజిటివ్ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ తెలిపారు. విషయం తెలిసిన సిబ్బంది కార్యాలయంలోకి వెళ్లకుండా బయటే ఉండి పోయారు. కలెక్టర్ కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు.
ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు కరోనా పాజిటివ్ - ఆదిలాబాద్ కరోనా వార్తలు
ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిని కరోనా కలవర పెడుతోంది. నిన్న ముగ్గురు అధికారులకు వైరస్ సోకింది. ఇవాళ ఏవోకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కలెక్టరేట్లో కరోనా బాధితుల సంఖ్య నాలుగుకి చేరింది.
coronavirus
కలెక్టర్ వ్యక్తి గత సహాయకులు ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో... నిర్దారణ కావడంతో అటు క్యాంపు కార్యాలయం, ఇటు కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో ఆందోళన మొదలైనది. పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వారి నమూనాలు సేకరించారు. ఇపుడు వారి నివేదికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది......
ఇదీ చదవండి:రెండు ఫ్యాన్లు, 4 లైట్లు.. కరెంట్ బిల్లు రూ.58 లక్షలు!
Last Updated : Jul 25, 2020, 2:56 PM IST