ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఎన్నికలు సజావుగా నిర్వహించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. సరిహద్దు ప్రాంతాలుగా ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్, యావత్‌మాల్, చంద్రపూర్ జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకొని ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఆసిఫాబాద్, సిర్పూర్లలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు తీసుకున్నామని చెబుతున్న ఆదిలాబాద్ కలెక్టర్ దివ్యదేవరాజన్, ఎస్పీ విష్ణు వారియర్లతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
'ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయండి' - దివ్యదేవరాజన్
ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు అధికారులు. ఆదిలాబాద్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు వారియర్ వెల్లడించారు.
కలెక్టర్