రైతు వేదిక నిర్మాణ పనులను అక్టోబర్ పదో తేదీలోపు పూర్తిచేయాలని ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శ్యాంపూర్, నర్సాపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న రైతు వేదిక నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. పనులు నత్తనడకన సాగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వర్షం కురిసినా ప్లాస్టిక్ కవర్లు ఏర్పాటుచేసి,నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు.
ఉట్నూరు జడ్పీటీసీ రాఠోడ్ చారులత.. వర్షాలు కారణంగా పంట నష్టపోయిన సోయా రైతులను.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.