తెలంగాణ

telangana

ETV Bharat / state

కుంటాల అందాలకు పాలనాధికారి ఫిదా - కుంటాల అందాలకు కలెక్టర్ ఫిదా

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కుంటాల జలపాతం అందాలకు ఫిదా అయ్యారు. కుంటాల కనువిందుగా ఉందని పాలనాధికారి సిక్తా పట్నాయక్ అన్నారు. ఆమె తన భర్త, కుమారుడితో కలిసి జలపాతాన్ని సందర్శించారు.

కుంటాల అందాలకు పాలనాధికారి ఫిదా
కుంటాల అందాలకు పాలనాధికారి ఫిదా

By

Published : Aug 2, 2020, 2:52 PM IST

కుంటాల జలపాతం కనువిందుగా ఉందని పాలనాధికారి సిక్తాపట్నాయక్‌ అన్నారు. శనివారం ఆమె భర్త జీవంత్‌రామ్‌పాల్‌ (ఐఐఎం అహ్మదాబాద్‌లో ఆర్థికశాస్త్ర ఆచార్యులు) కుమారుడితో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారు. పాలనురగల జలధారలను చూసి ఆమె మంత్రముగ్ధులయ్యారు.

చుట్టూ పచ్చటి చెట్లతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ జలపాతం అందాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని పాలనాధికారి పేర్కొన్నారు. ఆమె వెంట ఎఫ్‌బీవో బర్నోబ, తహసీల్దార్‌ శ్రీదేవి, ఆర్‌ఐ మీరాబాయి తదితరులున్నారు.

ABOUT THE AUTHOR

...view details