ఆదిలాబాద్‌లో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సంబురాల్లో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణువారియర్, జేసీ సంధ్యారాణి పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
హక్కుల కోసం పోరాడాలి: ఆదిలాబాద్ కలెక్టర్
ఆదిలాబాద్‌లో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్. ఈ కార్కక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
హక్కుల కోసం పోరాడాలి: ఆదిలాబాద్ కలెక్టర్
జగ్జీవన్ రాం బలహీన వర్గాల నుంచి వచ్చి ఉన్నత విద్యనభ్యసించి తమ హక్కుల కోసం కష్టపడటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ దివ్య దేవరాజన్ తెలిపారు. ఆయన బాటలో నడవాలని సూచించారు.
ఇవీ చదవండి: జిల్లా కలెక్టర్ అనే పేరు ఇక ఉండదా?