ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వైరస్ బారినపడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చివరి ముగ్గురు బాధితులు బుధవారం డిశ్ఛార్జీ అయ్యారు. జిల్లా నుంచి మొత్తం 21 మంది కొవిడ్ బారినపడగా వారందరికి గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందించారు. ఇది వరకే 18 మంది కోలుకోవడం వల్ల వారందరూ డిశ్ఛార్జీ అయ్యారు.
కరోనా రహిత జిల్లాగా ఆదిలాబాద్ - Adilabad district latest news today
ఆదిలాబాద్ కరోనా రహిత జిల్లాగా మారింది. నిన్న గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చివరి ముగ్గురు బాధితులు నిన్న డిశ్ఛార్జీ అయ్యారు. ఈ తరుణంలో జిల్లా కరోనా రహితంగా మారి గ్రీన్ జోన్‌కు మార్గం సులువైంది.
![కరోనా రహిత జిల్లాగా ఆదిలాబాద్ Adilabad as a corona free district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7193375-1001-7193375-1589444091045.jpg)
కరోనా రహిత జిల్లాగా ఆదిలాబాద్
మిగిలిన ముగ్గురికి నిర్ధరణ పరీక్షల్లో నెగెటివ్ నివేదికలు రావటం వల్ల ఆసుపత్రి వర్గాలు బుధవారం వారిని ఇంటికి పంపించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో యాక్టివ్ కేసులు సున్నాకు చేరాయి. అంతేగాక జిల్లాలో గత 20 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవటం వల్ల కరోనా రహిత జిల్లాగా మారి గ్రీన్ జోన్‌కు మార్గం సుగమం అయ్యింది.
ఇదీ చూడండి :వలస కూలీ దంపతులకు కరోనా పాజిటివ్!