తెలంగాణ

telangana

ETV Bharat / state

భలారే చిత్రం భలా.. గీతల్లోనే అద్భుతం ఆవిష్కరణ

Cubic Artist in Adilabad: పికాసో, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, ఎంఎఫ్‌ హుస్సేన్‌ చిత్రాలు చూపరులను అబ్బురపరుస్తాయి. ఇప్పుడలాంటి చిత్రాలు గీయడంలో అందవేసిన చెయ్యిలా ఎదుగుతున్నాడు..ఆదిలాబాద్‌ జిల్లా క్యూబిక్‌ ఆర్ట్‌ చిత్రకారుడు. అద్భుతమైన క్యూబిక్‌ ఆర్ట్‌ చిత్రరీతిని పునికిపుచ్చుకున్న ఈ కళాకారుడిపై ప్రత్యేక కథనం.

adilabad person who excelled in the art of rare cubic arts
గీతల్లోనే అద్భుతాన్ని సృష్టిస్తున్నఆదిలాబాద్ వాసి

By

Published : Apr 1, 2023, 2:17 PM IST

Cubic Artist in Adilabad: సామాన్యుడిలా కనిపించినా చెేతులతో అద్భుతాన్ని సృష్టించగలడు. ఒక చిత్రంలోనే ఎన్నో అంశాలను పొందుపరిచి సన్నివేశాలను కళ్లకు కట్టినట్లుగా చూపగలిగే నేర్పరి ఆదిలాబాద్ వాసి నరేందర్. ఏదైనా ఒక చిత్రాన్ని అందంగా గీయడం వేరు. ఒక చిత్రంలోనే పలు అంశాలు కళ్లకట్టినట్లుగా చిత్రీకరించడం వేరు. తన అద్భత కళతో దూసుకుపోతున్న నరేందర్ క్యూబిక్ ఆర్ట్స్ గురించి మీకోసం...

గీతల్లోనే అద్భుతాన్ని సృష్టిస్తున్నఆదిలాబాద్ వాసి

తలపై టోపీతో సామాన్యుడిలా కనిపిస్తున్న ఈ వ్యక్తి.. ఆదిలాబాద్‌కు చెందిన అన్నారపు నరేందర్‌. పాశ్చాత్య చిత్రకారుడు పికాసో, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, ఎంఎఫ్‌ హుస్సేన్‌ లాంటివారికి ఇష్టమైన చిత్రరీతి 'క్యూబిక్‌ ఆర్ట్‌'. పైకి గీతల్లానే కనిపించే ఈ ఆర్ట్‌ ఎన్నో హావభావాలను పలికిస్తుంది. కవికి ఆలోచన ఎలాంటి ముడిసరుకో చిత్రకారుడికి ఆయన మెదుడులో మెదిలే ఆలోచనే చిత్ర వస్తువు. 1996లో దిల్లీ వెళ్లిన నరేందర్‌ దృష్టి... క్యూబిక్‌ ఆర్ట్‌పై పడింది. 2004 వరకు అధ్యయనం చేసిన ఆయన.. అప్పుటి నుంచి అరుదైన చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. తాను గీసిన చిత్రాలను ముంబయి, దిల్లీ, హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియం వంటి చోట్ల ప్రదర్శనకు పెట్టారు.

"నా వర్క్​లో జామెట్రికల్ ఫామ్ ఉంటుంది. దానిలో మల్టిపుల్ ఇమేజెస్ ఉంటాయి. పెయింటింగ్స్​లో స్టోరీ, రిథమ్, ఎక్స్​ప్రెషన్స్ ఉంటాయి." - అన్నారపు నరేందర్‌, క్యూబిక్‌ చిత్రకారుడు

"ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం జరిగినప్పుడు దాని గురించి క్లుప్తంగా వివరించిన ఓ పెయింటింగ్ కనిపించింది. అది చాలా గొప్పగా ఉంది. కూచిపుడి డాన్స్ కు సంబంధించి ఒక చిత్రం ఉంది. అలాగే బుద్ధుడు, గణేశ్ చిత్రాలున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల గురించి కూడా ఒక చిత్రం ఉంది. ఆ చిత్రాన్ని చూస్తే అక్కడ జరిగిన సంఘటన మన కళ్ల ముందే జరిగినట్లుగా అనిపిస్తుంది." - ఛాత్రోపాధ్యాయురాలు

క్యూబిక్‌ ఆర్ట్‌ అంటే సమభుజి చిత్రరీతి. సమాజంలో ఉన్న ఎలాంటి వస్తువునైనా ఎంచుకొని బహుముఖ పార్శ్వాలు ప్రతిబింభింప చేయడం వీటి ప్రత్యేకత. ఈ నేపథ్యంలో నరేందర్‌ గీసిన తెలంగాణ బతుకమ్మ చిత్రాన్ని.... జర్మనీకి చెందిన వ్యక్తి లక్షా 40 వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు. నాట్య కళను ప్రతిబింబించే చిత్రాన్ని దిల్లీకి చెందిన జర్నలిస్టు 60వేల రూపాయలకు కొన్నారు. అరుదైన ఈ చిత్రకళను పాఠ్యపుస్తకాల్లో పొందుపరిస్తే... భవిష్యత్తులో అద్భుతమైన చిత్రకారుల తయారీకి పునాది ఏర్పడుతుందని కళారంగ నిపుణులు అంటున్నారు.

"క్యూబిక్ ఆర్ట్ గురించి కొంత పరిశోధన చేసి నేర్చుకున్నాడు. దాని తర్వాత తనది అని ఒక ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇతనికి జాహంగీర్ ఆర్ట్​లో అవకాశం దొరకడం గొప్ప విషయం. అలాగే దిల్లీలోని లలితా కళా అకాడమిలో అతని చిత్ర కళా ప్రదర్శన జరిగింది. ఇంకా పలు చోట్ల ఇతని కళా ప్రదర్శన అనేది జరిగింది." - రాజవర్దన్‌, ప్రముఖ చిత్రకారుడు

అలసటలేని జీవితాలకు సాంత్వన చేకూర్చడంలో... సంగీతం, సాహిత్యాలు క్రియాశీల పాత్ర పోషిస్తాయి. వాటి సరసన క్యూబిక్‌ ఆర్ట్‌ కూడా నిలుస్తోంది. మనసును ఉల్లాస పరుస్తున్న ఈ చిత్రాలు చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details