Adilabad DCCB election Chairman : తెరాస అధిష్ఠానం వరకు వెళ్లిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పదవి ఆదిలాబాద్‌కు చెందిన అడ్డి భోజారెడ్డిని వరించింది. రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తరఫున నిర్మల్‌కు చెందిన రఘునందన్‌రెడ్డి... మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు రాఠోడ్ బాపురావు, కోనేరు కోనప్ప నేతృత్వంలో ఆదిలాబాద్‌కు చెందిన అడ్డి భోజారెడ్డి ఛైర్మన్ పదవిని ఆశించడంతో అనిశ్ఛితి నెలకొంది. ఈ విషయమై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేల మధ్య రాజకీయ వైరానికి తెరలేవడంతో అధిష్టానం దృష్టికి వెళ్లింది. చివరికి అధినేత కేసీఆర్ సూచనతో కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదిలాబాద్‌కు చెందిన అడ్డి భోజారెడ్డి పేరు ప్రతిపాదించడంతో కథ సుఖాంతమైంది.
అడ్డి భోజారెడ్డి ఏకగ్రీవం
ఆదిలాబాద్‌లోని డీసీసీబీ బ్యాంకులో శనివారం జరిగిన ఎన్నికల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వర్గం తరఫున ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో అడ్డి భోజారెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాఠోడ్‌బాపురావుల నేతృత్వంలో తెరాస శ్రేణులు భోజారెడ్డిని అభినందించారు. టపాసులు పేల్చిసంబురాలు చేసుకున్నారు. రైతులకు 80శాతం పంటరుణాలు ఇస్తూ డీసీసీబీని అన్ని రంగాల్లో అభివృద్ది పథంలోకి తీసుకెళ్తామని నూతన ఛైర్మన్ భోజారెడ్డి ప్రకటించారు.
డైరెక్టర్ ఎన్నిక ఏకగ్రీవం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహాకార బ్యాంకు (డీసీసీబీ) డైరెక్టర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గత జులై 28న కాంబ్లే నాందేవ్ గుండె పోటుతో హఠాన్మరణం చెందడంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డైరెక్టర్ సహా ఛైర్మన్ పదవికి ఖాళీ ఏర్పడింది. ఈనెల 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర సహకార ఎన్నికల విభాగం ... శుక్రవారం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణకు గడువు విధించింది. తెరాస అధీనంలో ఉన్న డీసీసీబీలో నిర్మల్ జిల్లా ముక్తాపూర్‌కు చెందిన కోట చిన్నగంగాధర్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. డైరెక్టర్‌గా తనను ఎన్నుకున్న పార్టీకీ గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు.
రైతు సంక్షేమమే లక్ష్యం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. అడ్డి భోజారెడ్డిని డీసీసీబీ ఛైర్మన్‌గా తెరాస అధిష్ఠానం ఖరారు చేసింది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వ్యతిరేకంగా మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలోని ఎమ్మెల్యేలు రాఠోడ్ బాపురావు, కోనేరు కోనప్ప వర్గం మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగిన అంతర్గత రాజకీయ పోరుకు తెరపడింది. రాజకీయ పంథాలకు పోకుండా రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామంటున్న అడ్డి భోజారెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాఠోడ్ బాపురావులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
డీసీసీబీ ఛైర్మన్‌గా అడ్డి భోజారెడ్డి ఏకగ్రీవం ఇదీ చదవండి:ప్రజలతో మమేకమవుతా.. పదవికి వన్నెతెస్తా: జోగు రామన్న