తెలంగాణ

telangana

ETV Bharat / state

వయోపరిమితి పెంపుపై నిరసనగా ఏబీవీపీ అర్ధనగ్న ప్రదర్శన - abvp protests in adilabad

ఉద్యోగుల వయోపరిమితి పెంపును నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో అర్ధనగ్న ప్రదర్శనతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

abvp dharna in adilabad
ఏబీవీపీ అర్ధనగ్న ప్రదర్శన

By

Published : Mar 26, 2021, 3:12 PM IST

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును రాష్ట్ర ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్‌లో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శనతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలను దూరం చేసేలా ప్రభుత్వ వ్యవహరిస్తోందని.. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది.

ఇదీ చదవండి:రాష్ట్రాల హక్కులు హరించడంలో కాంగ్రెస్, భాజపాల పాత్ర : కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details