తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజలకు మేలు చేసే పనులు చేయండి: గోడం నగేశ్​ - aadilabad ex mp godam nagesh latest news

ఆదిలాబాద్​లో తెరాస, భాజపాల నడుమ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి పనుల్లో తెరాస ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై భాజపా వ్యాఖ్యలు చేయగా వాటిని ఖండిస్తూ తెరాస నాయకులు ఎదురుదాడికి దిగారు.

aadilabad ex mp godam nagesh criticised bjp
ప్రజలకు మేలు చేసే పనులు చేయండి: గోడం నగేశ్​

By

Published : Oct 26, 2020, 2:27 PM IST

ఆదిలాబాద్‌ జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో తెరాస, భాజపాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. 44 వ జాతీయ రహదారి సర్వీసు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనుల్లో జాప్యంతో తెరాస ప్రభుత్వంపై, భాజపా నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

రెండు రోజుల క్రితం ఆయా పనులను ప్రారంభించిన భాజపా ఎంపీ సోయం బాపురావు.. తెరాస నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆ పనులు మంజూరు చేయించింది తానేనని తెరాస మాజీ ఎంపీ గోడం నగేశ్​.. మీడియా సమావేశంలో వెల్లడించారు. తాను చేయలేని పనులను ప్రజల మేలు కోసం ఎప్పుడు చేయిస్తారో నిర్దిష్ట సమయం చెప్పాలని నగేశ్​​ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:'దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్'

ABOUT THE AUTHOR

...view details