తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్షరానికి దగ్గరైన ఆదివాసీల కథ...!

అది ఓ అటవీ ప్రాంతం... అక్కడి అమాయకపు ఆదివాసీలు చదువుకునేందుకు బడి కూడా లేదు. అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ఓట్లడిగేందుకు వచ్చిన లీడర్లు అవసరం తీరగానే యాదిమరిచారు. అ.. ఆ... లు దిద్దించ్చే గురువు లేక ఇన్ని రోజులు అలిగిన ఆ చేతులు... కల్మషం లేని ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో అక్షరమాలలు అల్లుతున్నాయి.

'కల్మషంలేని' మనసులకు అక్షర మాల...

By

Published : Feb 13, 2019, 12:12 AM IST

Updated : Feb 13, 2019, 9:39 AM IST

'కల్మషంలేని' మనసులకు అక్షర మాల...
ఆదిలాబాద్‌ జిల్లాలోని గుండంలొద్ది... మారుమూల గ్రామం. అధికారుల పర్యవేక్షణకు దూరంగా...నాయకులు ఓట్లు అడిగేందుకు తప్పా... కష్టాల్లో ఓదార్పుకు నోచుకోని ఓ అటవీ ప్రాంతం. ఆదివాసీలు మాత్రమే ఉండే ఈ గ్రామంలో 2006 వరకు ఓ సర్కారు బడి ఉండేది. చదువు చెప్పే సార్లు లేక అదీ మూతపడింది. లోకం పోకడ తెలియని ఆ అమాయకులు మాకిది కావాలని ఎవరినీ ప్రశ్నించలేదు.
ఇటీవల వచ్చిన వరదల కారణంగా... హైదరాబాద్‌కు చెందిన 'ప్యూర్‌' స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల బృందం... ఆ ప్రాంతాన్ని సందర్శించింది. అక్కడి ప్రజల బతుకును గమనించి.. వారి పరిస్థితికి చలించిపోయింది. సుమారు లక్షన్నరకు పైగా ఖర్చుచేసి బడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది తిరిగి ప్రారంభించింది. ఇంటర్‌ చదివిన ఓ యువకుడిని విద్యావాలంటరీగా నియమించి చిన్నారుల చేతులతో అక్షరాలు దిద్దిస్తోంది.
వ్యవసాయమే జీవనాధారంగా సాగే గుండంలొద్ది వాసులు ప్రభుత్వ పథకాలకూ నోచుకోవట్లేదు. స్వచ్ఛంద సంస్థ ప్రేరణతోనే దశాబ్దం తర్వాత బడి ప్రారంబించినప్పటికీ... మధ్యాహ్న భోజనం పెట్టేందుకూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
చూసిపోదామని వచ్చిన యువకుల హృదయాన్ని కరిగించిన ఆ బడుగు బతుకుల జీవన చిత్రం... గిరిజన అభ్యున్నతి కోసం పనిచేస్తామని మైకులు పగిలేలా అరిచే.... లీడర్ల దృష్టిని ఆకర్శించకపోవడం ఆశ్యర్యమే...!
Last Updated : Feb 13, 2019, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details