తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థినికి కరోనా.. పొలంలో ఐసోలేషన్..! - adilabad latest news

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఓ బాలికకు కరోనా సోకింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెని పొలం దగ్గర ఐసోలేషన్ చేశారు.

A girl was isolated in the farm due to covid
విద్యార్ధికి కరోనా

By

Published : Mar 30, 2021, 4:55 PM IST

ఓ ఇంటర్ విద్యార్థినికి కరోనా సోకటంతో.. ఆమె కుటుంబ సభ్యులు పొలం దగ్గర ఐసోలేషన్​లో ఉంచారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో చోటు చేసుకుంది.

తేజాపూర్ పంచాయతీ పరిధిలోని తాడిపూడికి చెందిన కరుణ అనే ఇంటర్ విద్యార్థికి కొవిడ్ సోకింది. బాలిక గురుకులాల్లో క్లాసులు హాజరవుతున్న తరుణంలో కరోనా బారిన పడింది. వెంటనే కళాశాల సిబ్బంది విద్యార్థినిని ఇంటికి పంపించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు కూతురిని పొలం దగ్గర ఐసోలేషన్​లో ఉంచారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ అధికారులు బాలికను పరామర్శించారు. విద్యార్థికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా గ్రామస్థులు అధికారులు చొరవ తీసుకున్నారు.

ఇదీ చదవండి: '2025 నాటికి డిజిటల్‌ ఉద్యోగాలు తొమ్మిది రెట్లు పెరగాలి'

ABOUT THE AUTHOR

...view details