ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ గోండు భాషలో మాట్లాడి ఆదివాసులను ఆకట్టుకున్నారు. 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలులో భాగంగా ఆదిలాబాద్ గ్రామీణ మండలం మాలే బోరిగామ్ గ్రామసభకు ఆమె హాజరయ్యారు. ఆదివాసులకు అర్థమయ్యేలా గోండు భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. నెల రోజుల్లో గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దాలని.. ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామస్థుల నుంచి వారి సమస్యలపై అర్జీలు స్వీకరించారు.
గోండు భాషలో ఆకట్టుకున్న కలెక్టర్ - Gondu
30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలులో భాగంగా ఆదిలాబాద్ గ్రామీణ మండలం మాలే బోరిగామ్ గ్రామసభలో పాలనాధికారి దివ్యరాజన్ పాల్గొన్నారు. గోండు భాషలో మాట్లాడి ఆదివాసులను ఆకట్టుకున్నారు.

గోండు భాషలో మాట్లాడిన కలెక్టర్
Last Updated : Sep 6, 2019, 6:54 PM IST