ఆదిలాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రిమ్స్ వైద్య కళాశాలలో నిన్న మధ్యాహ్నం కరోనా లక్షణాలతో చేరిన నిర్మల్‌కు చెందిన 35 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అస్వస్థతకు లోనైన బాధితున్ని తన బంధువులు తీసుకొచ్చి రిమ్స్‌లో చేర్పించి వెళ్లిపోయారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో కరోనా మహమ్మారికి మరొకరు బలి - corona updates
కరోనా మహమ్మారికి ఆదిలాబాద్ రిమ్స్‌లో మరొక వ్యక్తి బలయ్యాడు. మృతుడు నిర్మల్‌కు చెందిన వ్యక్తిగా అధికారులు తెలిపారు. ఈ మృతితో జిల్లాలో మరణాల సంఖ్య రెండుకు చేరినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా. నరేందర్ వెల్లడించారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో కరోనా మహమ్మారికి మరోకరు బలి
రాత్రి కొవిడ్ పరీక్ష చేసే సమయంలో బాధితుడు మరణించాడని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా. నరేందర్ రాఠోడ్ వెల్లడించారు. ఈరోజు మృతుని రిపోర్టు పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఈ మృతితో జిల్లాలో కొవిడ్ మరణాల సంఖ్య రెండుకు చేరినట్లు రాఠోడ్ తెలిపారు.