తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక దొంగ.. 31 బైకుల చోరీ.. - 31 BYKE THIEF in Adilabad district ARREST

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 ద్విచక్రవాహనాలను దొంగలించిన ఘరానా దొంగను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.8లక్షల 50వేలు ఉంటుందని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ వెల్లడించారు.

31 BYKE THIEF in Adilabad district  ARREST
31 బైక్​లను చోరి చేసిన దొంగ అరెస్టు

By

Published : Jan 16, 2020, 11:59 PM IST

ఆదిలాబాద్​ జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడి పోలీసులకు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో పార్క్ చేసిన వాహనాలను నకిలీ తాళాల సాయంతో ఎంతో నేర్పుగా దొంగతనం చేసేవాడని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్. వారియర్ వెల్లడించారు. వాటి విలువ రూ.8లక్షల 50వేలు ఉంటుందని తెలిపారు.

31 బైక్​లను చోరి చేసిన దొంగ అరెస్టు

ABOUT THE AUTHOR

...view details