ఆదిలాబాద్ జిల్లాలో రూ. 30 లక్షల విలువైన అక్రమ గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైనథ్ మండలం పూసాయి సమీపంలో అక్రమంగా గుట్కా నిల్వ ఉంచినట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. ఓ ఫాంహౌజ్‌లో సోదాలు నిర్వహించగా భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి.
రూ. 30 లక్షలు విలువైన అక్రమ గుట్కా స్వాధీనం - 30 lakhs valued gutka caught at adilabad district
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పూసాయి సమీపంలో రూ. 30 లక్షల విలువైన అక్రమ గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఓ ఫాంహౌజ్‌లో సోదాలు జరిపిన పోలీసులు ఇన్నోవా వాహనంతో పాటు కంటైనర్ లోడ్ కలిగిన గుట్కా మూటలు బయటపడ్డాయి.

రూ. 30 లక్షలు విలువైన అక్రమ గుట్కా పట్టివేత
ఫాంహౌజ్‌లో ఇన్నోవా వాహనంతో పాటు కంటైనర్ లోడ్ కలిగిన గుట్కా మూటలు బయటపడ్డాయి. ఆ సమయంలో ఫాంహౌస్‌లో మనుషులెవరూ లేకపోవడం వల్ల ఇద్దరు కానిస్టేబుళ్లను కాపలాపెట్టారు. అక్రమ గుట్కాను జైనథ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.