దీపావళి పండగ అంటే మనకి మిఠాయిలే గుర్తుకొస్తాయి. కానీ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలకు మాత్రం దీపావళి అంటే గారెల పండగే. సామూహికంగా ఈ గారెలని వండుతారు. తమ ఆరాధ్య దేవతలకు వాటిని నైవేద్యంగా పెడతారు. దీపావళి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలోని ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూర్, సిరికొండ, ఇచ్చోడ మండలాలతోపాటు కుమురం భీం జిల్లాలోని జైనూర్, సిర్పూర్, లింగాపూర్, తిర్యాణి మండలాల్లోని ఆదివాసీ గోండులు, కొలాంలు ఈ సంప్రదాయాన్ని తప్పక పాటిస్తారు. మినప్పప్పుని రుబ్బి పెనాలపై ఈ గారెలని కాల్చి దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక్క దీపావళి రోజే కాదు, తర్వాత వచ్చే వన భోజనాలప్పుడు... ముఖ్యమైన పండగలన్నింటికీ ఈ గారెలనే వండిపెట్టడం సంప్రదాయం. పావుకిలో నూనెతో రెండు కిలోల గారెలు సిద్ధమవుతాయి. రుచి బ్రహ్మండంగా ఉంటుంది.
పావుకిలో నూనెతో...రెండుకిలోల గారెలు!
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాల్లోని ఆదివాసీలు దీపావళిని గారెల పండగగా జరుపుకుంటారు. సామూహికంగా తయారు చేసి... తమ ఆరాధ్య దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. పావుకిలో నూనెతో... రెండు కిలోల గారెలు చేస్తారు.
పావుకిలో నూనెతో...రెండుకిలోల గారెలు!