తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా దినోత్సవ సందర్భంగా 2కే రన్ - షీ టీమ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్​లో 2కే రన్ నిర్వహణ

షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్​లో 2కే రన్ నిర్వహించారు. షీ టీమ్స్ గురించి బాలికలకు అవగాహన కల్పించారు.

womens day celebrations in adilabad
మహిళా దినోత్సవ సందర్భంగా 2కే రన్

By

Published : Mar 8, 2020, 12:19 PM IST

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షీ టీమ్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా జ్యోతిని వెలిగించి పరుగును ప్రారంభించారు.

ఈ పరుగులో బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆకతాయిల వేధిస్తే 100కు డయల్ చేయాలని ఎస్పీ తెలిపారు. షీ టీమ్ సభ్యులు తాము అందించే సేవల గురించి బాలికలకు అవగాహన కల్పించారు.

మహిళా దినోత్సవ సందర్భంగా 2కే రన్

ఇవీ చూడండి:ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details