ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వ్యాధి కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య... క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 284 మంది వ్యాధిబారిన పడ్డారు. 169 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. మహమ్మారితో ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో మొత్తం ముగ్గురు మృతిచెందారు.
అవిభాజ్య ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కలవరం - నిర్మల్ కరోనా కేసులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 284 మందికి కరోనా సోకింది. 169 మంది కోలుకొని ఇంటికివెళ్లారు. నలుగురు మృతి చెందారు. 112 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు 112 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 74 మంది ఉంటే, ఆ తరువాత స్థానంలో నిర్మల్ జిల్లాలో 17 మంది, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 12 మంది, ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది మంది బాధితులు ఉన్నారు. ఆదిలాబాద్ రిమ్స్, బెల్లంపల్లి, గోలేటి ఐసోలేషన్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో భౌతికదూరం పాటించాలనే నిబంధన ఎక్కడా అమలుకావడంలేదు.
ఇదీ చదవండి :ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం