ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీతోపాటు.. నేరడిగొండ, ఉట్నూర్ మండలాల పరిధిలో.. ప్రభుత్వం ప్రకటించిన 19 కరోనా కంటైన్మెంట్ ప్రాంతాల్లో అధికార యంత్రాంగం... అంగన్వాడీ ఉపాధ్యాయులతో సర్వే చేపట్టింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సర్వే, తిరిగి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మర్కజ్ యాత్రికుల ఇంటివద్ద నిఘా చేసేలా విధులు కేటాయించారు. కానీ శానిటైజర్లు, చేతి గ్లౌజులు కేటాయించకపోగా.. వేతనంలో రూ.1000 విధించడం అంగన్వాడీ ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోంది.
'జీతంలో రూ.1000 కోత విధించారు' - lock down in adilabad
కరోనా నియంత్రణలో భాగంగా అంగన్వాడీ ఉపాధ్యాయులకు విధులు కేటాయించిన అధికార యంత్రాంగం.. వారి భద్రత మరించింది. శానిటైజర్లు, చేతిగ్లౌజులు కేటాయించకపోగా.. వేతనంలో రూ.1000 కోత విధించడం విమర్శలకు తావిస్తోంది.
జీతంలో రూ.1000 కోత విధించారు.