ఆదిలాబాద్ జిల్లాలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 100కి చేరింది. పరీక్షలు చేయించుకున్న మరో 108 మంది ఫలితాలు రావాల్సి ఉంది. కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేసే తొమ్మిది మందికి కరోనా సోకింది. రెండు రోజుల్లోనే 43 పాటిజివ్ కేసులు నమోదు కావడం జిల్లాలో వైరస్ వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతుంది. ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడం జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
ఆదిలాబాద్లో 100కు చేరిన కరోనా కేసులు - ఆదిలాబాద్ జిల్లా వార్తలు
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా.. కలకలం రేపుతోంది. జిల్లా పాలనా వ్యవహారాలకు కేంద్ర బిందువైన కలెక్టరేట్లో పనిచేసే తొమ్మిది మందికి కరోనా సోకింది.
ఆదిలాబాద్లో 100కు చేరిన కరోనా కేసులు
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న సేవలపై అదనపు పాలనాధికారి డేవిడ్, అసిస్టెంట్ కలెక్టర్ అభిలాష ఆరా తీశారు. మెరుగైన సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఇవీ చూడండి:శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు