తెలంగాణ

telangana

ETV Bharat / state

మూగ వేదన.. కంటైనర్​ బోల్తాపడి 10 పశువులు మృతి - cows container boltha at adilabad

Animals died in container: నోరు తెరిచి బాధను చెప్పలేవనో, వాటి రోదన చెవికి ఎక్కకనేమో.. కొందరు మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కనికరం లేకుండా విచ్చలవిడిగా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. గాలి కూడా తగలకుండా కంటైనర్లలో ఇరికించి తరలింపు చేపడుతున్నారు. పరిమితికి మించిన పశువులతో రవాణా చేపట్టి.. వాటి ఉసురుపోసుకుంటున్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్​ కారణంగా 10 మూగజీవాల మృతికి కారణమయ్యారు.

container boltha
పశువులతో ఉన్న కంటైనర్​ బోల్తా

By

Published : May 7, 2022, 5:31 PM IST

Animals died in container: ఆదిలాబాద్ జిల్లా ఇచోడ మండలంలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. పరిమితికి మించిన పశువులతో తరలిస్తున్న లారీ కంటైనర్‌ బోల్తా పడి... 10 పశువులు మృతి చెందాయి. రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా సాత్ నంబర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తరువాత అందులోని వారు పరారయ్యారు.

పశువులతో ఉన్న కంటైనర్​ బోల్తా

బోల్తా పడిన లారీని... గమనించిన స్థానికులు కంటైనర్ తలుపులు పగులగొట్టగా.. 60 పశువులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని బయటకు తీసుకొచ్చారు. 50 బయటకు రాగా.. వాటిలో కొన్నిటికి గాయాలయ్యాయి. 10 మూగజీవాలు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గాయపడిన వాటికి ఇచోడ పశు వైద్యశాలలో చికిత్స అందించి.. గోశాలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details