పాకిస్థాన్ పర్యటనకు సిద్ధమవుతున్న జింబాబ్వే జట్టుకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. 25 మంది సభ్యుల్లో రెజిస్ చకబ్వా, టిమీసెన్ మరుమాలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సిబ్బందిలో మరో ఇద్దరికి కూడా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో 20 మంది ఆటగాళ్లు మాత్రమే పాకిస్థాన్‌కు వెళ్లారు. మంగళవారంతో వారి క్వారంటైన్ గడువు ముగుస్తోంది. తర్వాత వారికి మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇద్దరు జింబాబ్వే క్రికెటర్లకు కరోనా - zimbabwe cricket players covid19
జింబాబ్వే జట్టులోని ఇద్దరు క్రికెటర్లతో పాటు ఇద్దరు సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. పాక్ పర్యటనలో భాగంగా ఇస్లామాబాద్‌లో చేసిన పరీక్షల్లో ఈ విషయం నిర్ధరణ అయింది.
కరోనా బారిన పడ్డ జింబాబ్వే ఆటగాళ్లు
పాక్ పర్యటనలో భాగంగా జింబాబ్వే.. తలో మూడు వన్డేలు, టీ20ల్లో తలపడనుంది. వన్డేలు అక్టోబరు 30, నవంబరు 1, 3 తేదీలలో రావల్పిండి వేదికగా జరుగనున్నాయి. నవంబరు 7, 8, 10 తేదీలలో టీ20లు నిర్వహించనున్నారు.