టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన కొద్ది సేపటికే హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, కోచ్ గ్రాహమ్ రీడ్‌తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. వారిని అభినందించిన మోదీ.. నెలల తరబడి వారు చేసిన కృషి ఫలించిందని తెలిపారు.
"మీకు (మన్‌ప్రీత్, గ్రాహమ్), జట్టుకు అభినందనలు. చరిత్ర సృష్టించారు. యావద్దేశం ఆనందాల్లో మునిగి తేలుతోంది. మీ కృషి ఫలించింది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఈ సమయంలో 'మీ మాటలే స్ఫూర్తి నింపాయి' అని ప్రధానితో గురువారం ఫోన్ సంభాషణ సందర్భంగా అన్నాడు మన్‌ప్రీత్. కోచ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.