టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో గెలిచాడు టాప్ రెజ్లర్ బజరంగ్ పునియా. ఈ కాంస్యంతో.. ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఆరుకు చేరింది.
కజకిస్థాన్‌కు చెందిన నియాజ్బెకోవ్ దౌలెత్ను 8-0 తేడాతో చిత్తుచేశాడు బజరంగ్.
ఎన్నో అంచనాలతో ఫేవరేట్‌గా టోక్యో బరిలో దిగిన బజరంగ్ పునియా.. సెమీఫైనల్లో అజర్‌బైజాన్‌కు చెందిన అలియెవ్ హజీ చేతిలో 5-12 తేడాతో అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. అయినా.. ఇప్పుడు కంచు పట్టి భారత్ గర్వించేలా చేశాడు.
లండన్‌ను దాటేనా..?
2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలు సాధించింది. ఇప్పుడు టోక్యోలో కూడా.. అన్నే పతకాలు సాధించింది. అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా పతకం సాధిస్తే.. లండన్‌ను దాటనుంది భారత్.
ఇదీ చూడండి: అదితి అద్భుత ప్రదర్శన.. కానీ!